అందరికీ డబల్ బెడ్ రూమ్ ఇవ్వాలంటే కెసిఆర్ జీవితం సరిపోదు – మురళీధర్ రావు

-

జనం గోస – బీజేపీ భరోసా పేరుతో బైక్ ర్యాలీలతో బిజెపి గ్రామాల్లో ర్యాలీలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో
సిద్దిపేటలో నిర్వహించిన జనం గోస- బీజేపీ భరోసా కార్యక్రమంలో పాల్గొన్నారు బిజెపి జాతీయ నాయకుడు మురళీధర్ రావు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..అందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇల్లు రావాలి అంటే కెసిఆర్ జీవితం సరిపోదని అన్నారు.డబుల్ బెడ్ రూమ్ లు అనేది ఒక నాటకమని అన్నారు.

తెలంగాణను తిట్టిన వాళ్ళు, రాష్ట్రం ఏర్పడకుండా అడ్డుకున్న వారు ఇప్పుడూ మంత్రులు అయ్యారని అన్నారు. దేశంలో అతిపెద్ద అవినీతి రాష్ట్రంగా తెలంగాణని మార్చారని మండిపడ్డారు.కాళేశ్వరం ప్రాజెక్ట్ లో అవినీతి జరిగిందన్నారు.దేశ వ్యాప్తంగా ఉన్న సీఎంలలో బూతులు మాట్లాడే సీఎం ఒక్క కేసీఆర్ మాత్రమేనని అన్నారు.కాంగ్రెస్, టిఆర్ఎస్ రెండు పార్టీలు ఒకటేనని అన్నారు మురళీధర్ రావు.

Read more RELATED
Recommended to you

Exit mobile version