తెలంగాణ కాంగ్రెస్ అభ్యర్థులకు కీలక ఆదేశాలు..!

-

తెలంగాణలో రేపు అసెంబ్లీ ఎన్నికలు ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ అధిష్టానం కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థులను హైదరాబాద్ కి రావాలని పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. అయితే తాజాగా రాహుల్ గాంధీ జూమ్ మీట్ లో మాట్లాడారు. ముఖ్యంగా అభ్యర్థులు కౌంటింగ్ కేంద్రాల వద్దనే ఉండాలని సూచించారు. ఏమైనా ఇబ్బందులు ఉంటే వెంటనే రాష్ట్ర నాయకత్వం దృష్టికి తీసుకురావాలని ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ కాంగ్రెస్ అభ్యర్థులకు సూచించారు.

కాంగ్రెస్ అభ్యర్థులు, ముఖ్యనేతలతో వర్చువల్ సమావేశం నిర్వహించారు. ఎన్నికల కౌంటింగ్ జరుగుతున్న సమయంలో కౌంటింగ్ కేంద్రాలు దాటి రావద్దని.. అభ్యర్థులకు సూచించారు రాహుల్. కౌంటింగ్ సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. అనుసరించాల్సిన వైఖరిపై రాహుల్ గాంధీ అభ్యర్థులు నాయకులకు కీలక దిశా నిర్దేశం చేశారు. కౌంటింగ్ కేంద్రంలో ఎక్కడైనా సమస్యలుంటే.. స్పందించేందుకు పార్టీ నాయకులు అందరూ సిద్ధంగా ఉండాలని సూచించారు. కాంగ్రెస్ అభ్యర్థులను కేసీఆర్ టచ్ లోకి తీసుకుంటున్నారన్న సమాచారంతో అభ్యర్థులు అందరూ హైదరాబాద్ కి రావాలని.. పీసీసీ నేతలు ఆదేశాలు జారీ చేశారు. అభ్యర్థులను పిలవడం వల్ల వారిని అవమానించడం అవుతుందని.. దాని వల్ల తప్పుడు సంకేతాలు వెళ్తాయని అందువల్ల వారిని కౌంటింగ్ కేంద్రాల వద్దే ఉండాలని సూచించినట్టు సమాచారం.

Read more RELATED
Recommended to you

Exit mobile version