తెలంగాణ ఎన్నికల్లో పట్టుబడిన నగదు, గోల్డ్ విలువ ఎంతంటే..?

-

తెలంగాణలో ఎన్నికల సందర్భంగా కోడ్ అమలులోకి వచ్చిన తర్వాత భారీగా నగదు, మద్యం, గోల్డ్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వందల కోట్ల రూపాయలను పోలీసులు పట్టుకున్నారు. ఈ క్రమంలో రాష్ట్రంలో స్వాధీనం చేసుకున్న నగదు, తదితర వివరాలను అధికారులు వెల్లడించారు.

తెలంగాణలో ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిన నాటి నుంచి రూ.469.63 కోట్ల విలువైన వస్తువులను స్వాధీనం చేసుకోగా.. దీనికి సంబంధించి 11,859 ఎఫ్ఐఆర్ లను నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. అదే 2018 ఎన్నికల సందర్భంగా రెండు వేలకు పైగా కేసులు నమోదు కాగా.. రూ.103 కోట్ల విలువైన వస్తువులను స్వాధీనం చేసుకున్నట్టు వెల్లడించారు. ఇక 2018తో పోలిస్తే 2023లో భారీగా కేసులు పెరగగా.. భారీ మొత్తంలో నగదు పట్టుకున్నారు.

* నగదు 241.52 కోట్లు, 241 ఎఫ్ఐఆర్లు నమోదు.
* గోల్డ్/ సిల్వర్ 175.95 కోట్లు,5 ఎఫ్ఐఆర్లు నమోదు.
*మద్యం 13.36 కోట్లు, 11.195 ఎఫ్ఐఆర్లు నమోదు.
* డ్రగ్స్ 22.17 కోట్లు, 323 ఎఫ్ఐఆర్లు నమోదు.
* ఉచితాలు 16.63 కోట్లు, 95 ఎఫ్ఐఆర్లు నమోదు.

Read more RELATED
Recommended to you

Exit mobile version