ఇటీవల ఖమ్మంలో బీజేపీ కార్యకర్త సాయిగణేష్ ఆత్మహత్య చేసుకుని చనిపోవడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపింది. ఈ ఘటనపై టీఆర్ఎస్ పార్టీపై, పోలీస్ తీరు, మంత్రి పువ్వాడ అజయ్ పై బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు తీవ్రంగా విమర్శలు చేయడంతో పాటు ఘటనకు కారణం అయిన మంత్రి పువ్వాడను మంత్రి మండలి నుంచి బర్త్ రఫ్ చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. ఖమ్మం వ్యాప్తంగా బీజేపీ అనేక నిరసన, ఆందోళన కార్యక్రమాలను చేపట్టారు. ఘటనపై ఏకంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా స్పందించి… బాధిత కుటుంబాన్ని ఫోన్ లో పరామర్శించారు.
ఇదిలా ఉంటే సాయి గణేష్ ఆత్మహత్యపై హైకోర్ట్ లో ఇప్పకే ఓ పిటిషన్ దాఖలు కాగా… ప్రస్తుతం మరో పిటిషన్ దాఖలు చేశారు సాయిగణేస్ అమ్మమ్మ సావిత్రి. తన మనవడి ఆత్మహత్యపై సీబీఐ విచారణ జరిపించాలని తనకు రక్షణ కల్పించాలంటూ రిట్ పిటిషన్ దాఖలు చేశారు.