క్యాన్సర్ బాధితులకు శుభవార్త.. తెలంగాణలోనే మొట్టమొదటి డే కేర్ కీమో థెరపీ సెంటర్

-

సిద్ధిపేట సర్వజన ఆసుపత్రిలో డే కేర్ కీమో థెరపీ సెంటరు ప్రారంభం చేశారు మంత్రి హరీశ్ రావు. తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటి డే కేర్ కీమో థెరపీ సెంటర్ ను సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రారంభించుకోవడం సంతోషంగా ఉంది… సిద్దిపేటతో పాటు ఖమ్మం, కరీంనగర్, వనపర్తి, సిరిసిల్లలో వీటిని మంజూరు చేసుకున్నామని వెల్లడించారు.

 

క్రమంగా ఎనిమిది మెడికల్ కాలేజీల్లో, ఆ తర్వాత 33 జిల్లాల్లో వచ్చే మెడికల్ కాలేజీల్లో ఏర్పాటు చేసుకునేలా ప్రణాళిక ఉంది… కేన్సర్ వ్యాధి తీవ్రత ఉన్న పేషంట్లకు హైదరాబాద్ దాకా వెళ్లకుండానే, జిల్లాలోనే కీమో తెరపి సేవలు పొందుతారన్నారు.

 

ఎంతో దూరం ప్రయాణించి, పని వదులుకొని రెండు మూడు రోజులపాటు కీమో సేవల కోసం ఎదురుచూసే పరిస్థితి ఉండదు ఇక…ఇక్కడి సెంటర్ లో 4 పడకలు ఉంటాయి. ఎం ఎన్ జే కేన్సర్ ఆసుపత్రిలో శిక్షణ పొందిన ఒక మెడికల్ ఆఫీసర్, ఇద్దరు స్టాఫ్ నర్స్ లు ఉంటారన్నారు. 60 రకాల మందులు ఇక్కడ అందుబాటులో ఉంటాయి. ఇవి ఎం ఎన్ జే కేన్సర్ ఆసుపత్రి నుండి ఇక్కడికి సరఫరా అవుతాయి.ఎం ఎం జే, నిమ్స్ ఆసుపత్రులు రిఫర్ చేసిన కేన్సర్ పేషెంట్లు ఇక్కడ కీమో థెరపీ సేవలు పొందవచ్చు అన్నారు హరీశ్ రావు.

Read more RELATED
Recommended to you

Exit mobile version