కాళేశ్వరంపై తెలంగాణ సమాజమంతా ఆందోళన వ్యక్తం చేస్తోంది: కిషన్‌రెడ్డి

-

రాష్ట్రప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు అట్టర్‌ ఫ్లాప్‌ అయ్యిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి విమర్శించారు. కాసుల కోసం, కమీషన్ల కోసం కక్కుర్తిపడి రాష్ర్ట ప్రజల సొమ్మును దుర్వినియోగం చేశారని ఆరోపించారు. కాళేశ్వరం మేడిగడ్డ లక్ష్మి బ్యారేజ్ కుంగిన పిల్లర్లను పార్టీ నేతలతో కలిసి పరిశీలించారు. కాళేశ్వరం ప్రాజెక్టు భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారిందని వ్యాఖ్యానించారు.

‘నేషనల్‌ డ్యామ్‌ సేఫ్టీ అథారిటీ కాళేశ్వరాన్ని పరిశీలించింది. కాళేశ్వరంపై నేషనల్‌ డ్యామ్‌ సేఫ్టీ అథారిటీ నివేదికను కేంద్రానికి ఇచ్చింది. నేషనల్‌ డ్యామ్‌ సేఫ్టీ అథారిటీ నివేదికలో కీలక అంశాలు పొందుపర్చారు. కాళేశ్వరం ప్రశ్నార్థకంగా మారింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రజల పన్నులతో కాళేశ్వరం నిర్మాణం చేసింది. కాళేశ్వరం నిర్మాణానికి రూ.40వేల కోట్ల అంచనా వేశారు. రూ.1.30 లక్షల కోట్లకు పెంచారు. కాళేశ్వరంపై తెలంగాణ సమాజమంతా ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఇంజినీర్ల నోరు మూయించి కేసీఆరే ఇంజనీర్‌గా వ్యవహరించారు. కేసీఆర్ ఉత్తరం రాస్తే 15 నిమిషాల్లో సీబీఐ విచారణ చేస్తుంది.’ అని కిషన్ రెడ్డి అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version