మూడోసారి మోడీ ప్రమాణ స్వీకారానికి ముహుర్తం ఫిక్స్.. తేది వెల్లడించిన కిషన్ రెడ్డి

-

జూన్ 8 లేదా 9వ తేదీన నరేంద్ర మోడీ మూడవ సారి భారత ప్రధాని ప్రమాణ స్వీకారం చేస్తారని కేంద్రమంత్రి, టీ-బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం సికింద్రాబాద్ పరిధిలోని మెయినాబాద్లో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. దేశంలో కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి వస్తే మాఫియా పాలన వస్తుందని.. దేశ అభివృద్ధి కోసం ప్రజలు మరోసారి బీజేపీకి ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. మోడీ హయాంలో మేకిన్ ఇండియాకు ప్రాధాన్యం పెరిగిందన్నారు.

మోడీ వచ్చాక దేశంలో దిగుమతులు తగ్గి.. ఎగుమతులు పెరిగాయని తెలిపారు. కాంగ్రెస్ హయాంలో రూ.12 లక్షల కోట్ల కుంభకోణాలు జరిగాయని ఆరోపించారు. కానీ మోడీ మాత్రం పదేళ్లుగా నీతివంతమైన పాలన చేస్తున్నారని అన్నారు. ఆర్టికల్ 370ని మళ్లీ తీసుకొస్తామని కాంగ్రెస్ అంటోందని కిషన్ రెడ్డి ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ పార్లమెంట్ ఎన్నికల మేనిఫెస్టో హిందువులకు వ్యతిరేకమని విమర్శలు గుప్పించారు. ముస్లిం లీగ్ ఆలోచనలతో కాంగ్రెస్ ముందుకు సాగుతోందని ధ్వజమెత్తారు

Read more RELATED
Recommended to you

Exit mobile version