నల్గొండ ఎమ్మెల్యే టికెట్ వదులుకోవడానికి రెడీ.. కోమటి రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు

-

సిద్దిపేట జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ భువనగిరి ఎంపీ కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి మీడియా సమావేశంలో పలు ఆసక్తికర కామెంట్స్ చేశారు. ముఖ్యంగా హోం గార్డు మృతిపై స్పందించారు ఎంపీ కోమటిరెడ్డి. హోమ్ గార్డ్ రవీందర్ మరణించడం చాలా దురదష్టకరం అని.. ఇది ముమ్మాటికీ ప్రభుత్వ హత్య అన్నారు. సిద్దిపేట, సిరిసిల్ల, గజ్వేల్ లో ఎక్కడైనా వ్యవసాయానికి 15 గంటల కరెంట్ ఇస్తే ఎంపీ పదవికి రాజీనామా చేస్తానని హరీష్ రావుకి సవాల్ చేస్తున్నా అన్నారు ఎంపీ కోమటిరెడ్డి.

తనకు కాంగ్రెస్ పార్టీ పై ఎలాంటి అసంతృప్తి లేదు. కానీ కెసిఆర్ ప్రభుత్వం పై ఉంది అని తెలిపారు. ఈ 17న జరిగే కాంగ్రెస్ బహిరంగ సభను విజయవంతం చేయాలని కోరారు. కెసిఆర్ నీ ఇంటికి పంపేందుకు కొంగర కొలాన్ మీటింగ్ ఏర్పాటు చేస్తున్నామని.. కర్ణాటక తరహాలో తెలంగాణలోను సోనియా గాంధీ ప్రకటన చేస్తారు. సోనియా వల్లే తెలంగాణ వచ్చింది అని కేసీఆర్ చెప్పాడు. నేడు బిఆర్ఎస్ ఇచ్చే 4వేల పెన్షన్ కాంగ్రెస్ హయాంలో 400లతొ సమానం అన్నారు. పార్లమెంట్ సమవేశాల్లో జమిలి ఎన్నికలు అనే చర్చ వస్తుంది అన్నారు. ముదిరాజ్ లకు ఒక్క ఎమ్మెల్యే టికెట్ కూడా కెసిఆర్ ఎదుకు ఇవ్వలేదు అని ప్రశ్నించారు.  మరోవైపు సామాజిక సమీకరణాలలో బాగంగా అవసరం అయితే నేను నల్గొండ ఎమ్మెల్యే టికెట్ వదులుకోవడానికి రెడీ అని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version