BRS నేతలు ఓవర్ గా మాట్లాడితే దెబ్బకు దెబ్బ తీయండి: కోమటిరెడ్డి

-

BRS నేతలు ఓవర్ గా మాట్లాడితే దెబ్బకు దెబ్బ తీయండని తెలంగాణ మంత్రి కోమటి రెడ్డి వెంకట్‌ రెడ్డి వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. కౌశిక్‌ రెడ్డి, గాంధీ విషయంపై తెలంగాణ మంత్రి కోమటి రెడ్డి వెంకట్‌ రెడ్డి స్పందించారు. అరికె పూడి గాంధీ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అని.. అసలు కాంగ్రెస్‌ పార్టీకి చెందిన వాడు కాదన్నారు.

komatireddy on arekapudi gandhi and koushik reddy

చచ్చిన బీఆర్ఎస్ పార్టీని బ్రతికించడం కోసం డ్రామాలాడుతున్నారని ఆగ్రహించారు. మేం తలుచుకుంటే బీఆర్ఎస్ ఉండేదా?? బీఆర్ఎస్ నాయకులను రోడ్లమీద తిరగనివ్వబోమని హెచ్చరించారు. కాంగ్రెస్ శ్రేణులు అందరూ సంయమనం పాటించాలని కోరారు మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి. రెచ్చ గొట్టే విధంగా ఎవ్వరు మాట్లిడినా చట్ట పరంగా చట్టాలుంటాయన్నారు. సంఘ విద్రోహ చర్యల మీద కఠినంగా ఉండాలని ఇప్పటికే సీఎం ఆదేశించారని.. గణేష్ ఉత్సవాలు ప్రశాంతంగా జరిగేందుకు ప్రజలు కూడా సహకరించాలని కోరారు తెలంగాణ మంత్రి కోమటి రెడ్డి వెంకట్‌ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Exit mobile version