తెలంగాణ రైతులకు షాక్ తగిలింది. రుణ మాఫీ దశలవారీగా చేస్తామని ప్రకటించారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. ఆగస్ట్ 15 తారీకు లోపల రైతులకు 2 లక్షల రైతు రుణమాఫీ చేసి తీరుతానని రెండు రోజుల కిందట సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. కానీ ఇప్పుడు రుణ మాఫీపై సీఎం రేవంత్ ఒక మాట, మంత్రులు మరో మాటగా వ్యవహరం ఉంది.
రుణ మాఫీ మొత్తం ఒకేసారి చేస్తానని చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. రుణ మాఫీ దశలవారీగా చేస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వెల్లడించారు. దీంతో రైతులు ఆగం అవుతున్నారు.
ఇక అటు మంత్రి కోమటరెడ్డి వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ను కేసీఆర్….టచ్ చేస్తే BRS పునాదులను కూల్చేస్తామని హెచ్చరించారు. దేశంలోనే దరిద్రమైన పాలన అందించిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిది..రేవంత్ రెడ్డి ముఖం చుడలేక కేసిఆర్ అసెంబ్లీకి రాలేదని చురకలు అంటించారు. మేము గేట్లు తెరిస్తే… ఎమ్మెల్యే లుగా ఉన్న సభ్యులు తప్ప బీఆర్ఎస్ లో ఎవరూ మిగలరని వార్నింగ్ ఇచ్చారు.