ఎకరాకు రూ.7 వేలు చొప్పున ఇస్తామని రైతు బంధు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రకటన చేశారు. రైతు బంధుపై మరోసారి మాట తప్పిన రేవంత్ సర్కార్.. తాజాగా రైతు బంధు పై కీలక ప్రకటన చేసింది. డిసెంబర్ నుంచి సంక్రాంతికి రైతు బంధు షిఫ్ట్ చేసింది. ఉదయం నుంచి దీనిపైన చాలా రకాల కథనాలు వచ్చాయి.
కొన్ని రోజుల ముందు వరకూ.. డిసెంబర్‌కల్లా రైతు బంధు ఇస్తామన్న ప్రభుత్వం.. ఇప్పుడు సంక్రాంతికి ఇస్తామని తెలిపింది. కానీ.. ఇప్పుడు సంక్రాంతికి రైతు భరోసా ఇస్తామంటున్న సర్కార్… తేదీ మాత్రం ఖరారు చేయలేదు. ఇలాంటి నేపథ్యంలో…ఎకరాకు రూ.7 వేలు చొప్పున ఇస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రకటన చేశారు.మరి.. ఈసారైనా హామీ నెరవేరుస్తారా? లేక వాయిదా వేస్తారా? అంటూ సందేహాలు వ్యక్తం చేస్తున్నారు తెలంగాణ రైతులు.
ఇక అటు రైతుబంధు కంటే బోనస్ బాగుందని రైతులు అంటున్నారు అంటూ బాంబు పెల్చారు తుమ్మల నాగేశ్వరరావు. ఎకరానికి రూ.15 వేల వరకు బోనస్ వస్తుందని రైతులు చెబుతున్నారు అన్నారు తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ఏది రైతుకు మేలు అంటే అదే చేస్తాము అని పేర్కొన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు.