కోరుట్ల దీప్తి మర్డర్ కేసులో పురోగతి.. పోలీసుల అదుపులో చందన

-

జగిత్యాల జిల్లా కోరుట్లలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ దీప్తి అనుమానాస్పద మృతి కేసులో పోలీసులు పురోగతి సాధించారు. దీప్తి మృతి చెందిన రోజు ఆమె చెల్లెలు చందన ఇంటి నుంచి వెళ్లిపోయిన విషయం తెలిసిందే. చందనే దీప్తిని హత్య చేసి ఉంటుదన్న వార్తలు వచ్చిన నేపథ్యంలో ఆమె తన అక్కను చంపలేదంటూ ఓ ఆడియోను తన సోదరుడికి పంపింది. ఈ నేపథ్యంలో దర్యాప్తు ముమ్మరం చేసిన పోలీసులు చందనను అదుపులోకి తీసుకుని విచారిస్తే అసలు విషయం బయటపడుతుందని భావించారు.

చందన ఆచూకీ నాలుగు రోజుల నుంచి ప్రత్యేక బృందాలుగా ఏర్పడి ముమ్మర గాలింపు చేపట్టారు. విదేశాలకు వెళ్లకుండా లుక్‌ అవుట్‌ నోటీసులు కూడా జారీ చేసేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. శుక్రవారం రోజున ఆంధ్రప్రదేశ్​లోని ప్రకాశం జిల్లా ఒంగోలు వద్ద చందన, ఆమె ప్రియుడు, వారికి సహకరించిన కారు డ్రైవర్‌, ఆశ్రయం కల్పించిన వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. చందనను అదుపులోకి తీసుకున్న విషయం పోలీసులు ధ్రువీకరించాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version