ఈ ఏడాది తొలి 4 నెలల్లో.. తెలంగాణ అప్పులు రూ.20,637.23 కోట్లు

-

ఈ ఆర్థిక సంవత్సరం తొలి నాలుగు నెలల్లోనే తెలంగాణ రూ.20వేల కోట్లకు పైగా అప్పులు చేసింది. రాష్ట్ర ప్రభుత్వానికి పన్నులపై ఆదాయం జూన్‌తో పోలిస్తే జులైలో రూ.640 కోట్లు తగ్గింది. రుణసేకరణ పెరిగింది. 2023-24 తొలి 4 నెలల్లో ప్రభుత్వం రూ.20,637.23 కోట్ల రుణాలను సేకరించింది. గతేడాది కంటే 99.56 శాతం అధికంగా రుణాలను తీసుకున్నట్లు ‘కాగ్‌’ తాజాగా నెలవారీ జులై నివేదికలో స్పష్టం చేసింది.

ప్రస్తుత ఏడాది బడ్జెట్‌లో ఆదాయం అంచనా రూ.2.59 లక్షల కోట్లు కాగా రూ.67,494.73 కోట్లు వచ్చింది. ఇందులో రూ.20,637.23 కోట్లు రుణాలే. కేంద్ర ప్రభుత్వ గ్రాంటు కింద రూ.41,259.17 కోట్లు వస్తుందని అంచనా వేయగా ఇందులో కేవలం 5.62 శాతం(రూ.2317.82 కోట్లు) వచ్చింది. రాష్ట్ర రెవెన్యూ రాబడిలో కీలకమైన పన్నులపై ఆదాయం ఏడాది లక్ష్యం రూ.1.52 లక్షల కోట్లకు గాను 28.01 శాతం(రూ.42,712.27 కోట్లు) వచ్చింది. ఈ ఏడాది మొత్తం వ్యయం రూ.2.49 లక్షల కోట్లు ఉంటుందని బడ్జెట్‌లో అంచనా వేయగా జులై నాటికి రూ.63,607.91 కోట్లు ఖర్చుపెట్టినట్లు కాగ్ నివేదిక తెలిపింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version