కులగణన సర్వేతో.. 200 కోట్లు వృధా చేశారు – కేపీ వివేకానంద

-

కులగణన సర్వేతో.. 200 కోట్లు వృధా చేశారని ఆరోపణలు చేశారు బీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యే కేపీ వివేకానంద. రేవంత్ సర్కార్ 2 నెలల్లో సుమారు 200 కోట్లు వృధా చేసింది… కులగణన సర్వేతో.. వాళ్లు బలహీన వర్గాల వారిని గాయపరిచారని ఫైర్ అయ్యారు కేపీ వివేకానంద. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కుల గణన పై తమ వైఫల్యాన్ని ఒప్పుకున్నారని చురకలు అంటించారు.


200 కోట్ల రూపాయలతో చేపట్టిన సర్వే తో 2 కోట్ల మంది బడుగు బలహీన వర్గాలను అవమానించారని తెలిపారు. సర్వే ను సరిగా చేయడం చేతకాని ప్రభుత్వం మంచి పాలన ఎలా అందిస్తుంది ? అంటూ వ్యాఖ్యానించారు. రేవంత్ సర్కార్ ఏదీ చేసినా తిరోగమనమే అన్నారు. అన్నింటా ఈ ప్రభుత్వం అభాసు పాలవుతోందని… బీ ఆర్ ఏస్ సహా బీసీ సంఘాలన్నీ రీ సర్వే కు డిమాండ్ చేశాయని తెలిపారు. కులాల జనాభా ను కుట్ర పూరితంగా తక్కువ చేసి చూపించారని ఫైర్‌ అయ్యారు బీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యే కేపీ వివేకానంద.

Read more RELATED
Recommended to you

Latest news