రేపు హైదరాబాద్​లో కేఆర్ఎంబీ సమావేశం

-

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం రేపు హైదరాబాద్​లోని జలసౌధలో జరగనుంది. ఈ భేటీలో తెలంగాణ తన వాదనలను మరోసారి బలంగా వినిపించేందుకు సిద్ధమైంది. కృష్ణా జలాలను రెండు రాష్ట్రాలకు చెరిసగం కేటాయించాల్సిందేనని అంటోంది. ఇదే విషయంపై కేంద్ర జలశక్తి శాఖకు లేఖ రాసిన రాష్ట్ర ప్రభుత్వం… రేపటి సమావేశంలో మరోమారు వాదన వినిపించనుంది. పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టుకు సంబంధించిన అనుమతులు, డీపీఆర్ అంశాన్ని కూడా సమావేశంలో ప్రస్తావించే అవకాశం ఉంది.

పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టు అనుమతులు సహా, తాగునీటి వినియోగాన్ని 20 శాతంగా పరిగణనలోకి తీసుకోవడం, టెలీమెట్రీ ఏర్పాటు, RDS ఆధునీకరణ అంశాలను ప్రస్తావించనుంది. అనుమతుల్లేకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చేపట్టిన ప్రాజెక్టుల పనులను కూడా కృష్ణా బోర్డు సమావేశంలో లేవనెత్తనుంది. మరోవైపు కృష్ణా నదీ యాజమాన్య బోర్డులో రాష్ట్రం తరపున మూడో సభ్యుడిని కూడా చేర్చాలని ప్రభుత్వం కోరుతోంది. వీటితో పాటు శ్రీశైలం, నాగార్జునసాగర్‌లో జలవిద్యుత్ ఉత్పత్తి, సహా ఇతర అంశాలపై కూడా రాష్ట్ర వాదనలను వినిపించనున్నారు. ట్రైబ్యునల్, బోర్డు అనుమతుల్లేకుండా ఆంధ్రప్రదేశ్ పలు ప్రాజెక్టులు చేపడుతోందని… రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే పలు ఫిర్యాదులు చేసింది. ఆ అంశాన్ని కూడా రేపటి సమావేశంలో ప్రస్తావించే అవకాశం ఉంది

Read more RELATED
Recommended to you

Exit mobile version