KTR : అసెంబ్లీ సమావేశాలకు కేటీఆర్‌ దూరం..కారణం ఇదే

-

తెలంగాణ తొలి రోజు అసెంబ్లీ సమావేశాలకు కేటీఆర్‌ దూరం అయ్యారు. మాజీ సీఎం కేసీఆర్ సర్జరీ నేపథ్యంలో మరొక రోజు ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు కేటీఆర్. భారత రాష్ట్ర సమితి అధ్యక్షులు కేసీఆర్ గారి సర్జరీ నేపథ్యంలో ఈరోజు అసెంబ్లీలో జరుగుతున్న ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరు కాలేకపోయారు.

KTR away from assembly meetings

ప్రమాణ స్వీకారానికి సంబంధించి మరొక రోజు సమయం ఇవ్వాలని శాసనసభ సెక్రటరీని కేటీఆర్ కోరారు. కెసిఆర్ గారి వెంట ఆస్పత్రిలో ఉన్నందున ఈరోజు తెలంగాణ భవన్ లో జరిగిన టిఆర్ఎస్ ఎల్పీ సమావేశానికి కూడా కేటీఆర్ హాజరు కాలేకపోయారు. కెసిఆర్ గారి ఆరోగ్యం కుదుటపడిన తర్వాత ఎమ్మెల్యేగా మరోరోజు ప్రమాణస్వీకారం చేయనున్నట్లు కేటీఆర్ తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version