రైతులకు సబ్సిడీపై ట్రాక్టర్లను అందజేసిన ఎంపీ కేశినేని నాని

-

రైతులకు సబ్సిడీ పై ట్రాక్టర్లను అందజేశారు విజయవాడ ఎంపీ కేశినేని నాని. ఈ సందర్భంగా కేశినేని నాని మాట్లాడుతూ..మిచౌన్గ్ తుఫాన్ ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర రైతాంగాన్ని అతలాకుతలం చేసిందని ఫైర్ అయ్యారు. అన్ని పంటలు, పూత మీద మామిడి కూడా దెబ్బ తిన్నదని పేర్కొన్నారు. కొన్ని లక్షల ఎకరాల్లో పంట దెబ్బ తిండి,వరి రైతులు తీవ్రంగా నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు కేశినేని నాని.

MP Keshineni Nani who gave subsidized tractors to farmers

ఎకరానికి 40 నుంచి 50 వేల ఎకరాలు నష్టపోయారన్నారు. రైతులను ఆదుకోవడం లో జగన్ సర్కార్ పూర్తిగా వైఫల్యం చెందిందని.. హుద్ హుద్ తుఫాన్ సమయంలో చంద్రబాబు అక్కడే ఉండి ప్రజలకు ధైర్యం ఇచ్చారని వివరించారు కేశినేని నాని.

ఈ రోజు చాలా నిర్లక్ష్యంగా రైతులను గాలికొదిలేసిందని..ఇలాంటి ప్రభుత్వం ఉండడానికి వీల్లేదని మండిపడ్డారు కేశినేని నాని. కేంద్రంలో ఆదుకోమని తెదేపా ఎంపిక పార్లమెంట్ లో డిమాండ్ చేశారు…ముందుగా 5 వేల కోట్లు విడుదల చేయాలని తెదేపా ఎంపిలు కోరారన్నారు. కేంద్ర మంత్రిని ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించాలని కోరామని తెలిపారు కేశినేని నాని.

Read more RELATED
Recommended to you

Exit mobile version