పారిస్ ఒలింపిక్స్ 2024.. భారతీయ అథ్లెట్లకు కేటీఆర్ బెస్ట్ విషెస్

-

ఒలింపిక్స్ క్రీడల్లో పాల్గొంటున్న క్రీడాకారులందరికీ బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వహక అధ్యక్షుడు కేటీఆర్ ఎక్స్‌ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. దేశం తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్న 117 మంది క్రీడాకారులను ప్రజలంతా ఉత్సాహపరచాలని అన్నారు. 2020 జపాన్‌లో జరిగిన టోక్యో ఒలింపిక్స్‌లో సాధించిన 7 పథకాల రికార్డును దాటి… ఈసారి చరిత్ర సృష్టిస్తారని కేటీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు.

క్రీడాకారులందరూ దేశం తరఫున అత్యుత్తమ ప్రదర్శనతో విజయం సాధించి కీర్తిప్రతిష్ఠలు తెస్తారని ఆశించిన ఆయన… వారందరికీ హృదయపూర్వక అభినందనలు చెప్పారు. ‘దేశమంతా ఏకతాటిపైకి వచ్చి క్రీడాకారులు సాధించే విజయాల్లో భాగస్వాములుగా అయ్యేందుకు ఉత్సాహంగా ఎదురుచూస్తున్నాం. ఒలింపిక్స్ క్రీడల్లో పాల్గొంటున్న నికత్ జరీన్, పీవీ సింధు, ఆకుల శ్రీజ, ఎర్రజి జ్యోతి, జ్యోతిక శ్రీ దండి, ఈషా సింగ్, సాత్విక సాయిరాజ్, ధీరజ్ బొమ్మదేవరలకు కేటీఆర్ శుభాకాంక్షలు. అలాగే ఒలింపిక్స్ క్రీడల్లో దేశం తరఫున పతకాలు సాధించిన టేబుల్ టెన్నిస్ క్రీడాకారుడు శరత్ కమల్, బ్యాట్మెంటన్ దిగ్గజం పీవీ సింధు, గగన్ నారంగ్‌లకు ప్రత్యేక శుభాకాంక్షలు’ అని కేటీఆర్ ట్వీట్లో పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version