ఆగస్టులో ఉక్రెయిన్‌కు ప్రధాని నరేంద్రమోదీ!

-

భారత ప్రధానిగా మూడోసారి అధికారం చేపట్టిన నరేంద్ర మోదీ వరుస విదేశీ పర్యటనలు చేస్తున్నారు. ఇటీవల ఇటలీ, రష్యా, ఆస్ట్రియాలో పర్యటించిన ఆయన త్వరలోనే ఉక్రెయిన్కు వెళ్లనున్నట్లు సమాచారం. ఇటీవల ఇటలీలో జరిగిన జీ7 సదస్సులో ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌ స్కీతో ప్రధాని మోదీ భేటీ అయిన విషయం తెలిసిందే. రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం మొదలైనప్పటి నుంచి చర్చలు, దౌత్యం ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని భారత్‌ సూచిస్తున్న విషయం తెలిసిందే.

ఇక గతంలో.. ఉక్రెయిన్‌లో పర్యటించాలని ప్రధాని నరేంద్ర మోదీని ఆ దేశాధ్యక్షుడు జెలెన్‌స్కీ ఆహ్వానించిన విషయం తెలిసిందే. లోక్సభ ఎన్నికల్లో గెలిచి మూడోసారి అధికారంలోకి వచ్చిన మోదీకి ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపిన జెలెన్స్కీ.. తీరిక చేసుకుని ఉక్రెయిన్‌లో పర్యటించాల్సిందిగా కోరారు. అంతర్జాతీయ వ్యవహారాల్లో భారత్‌ ప్రాముఖ్యత, పాత్రను ప్రపంచంలోని ప్రతి ఒక్కరూ గుర్తిస్తున్నారని .. అన్ని దేశాల్లో శాంతి నెలకొల్పేందుకు అందరం కలిసి పనిచేయడం ఎంతో చాలా కీలకం అని జెలెన్స్కీ అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version