రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్..దమ్ముంటే చంచల్‌ గూడాకు రా !

-

సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్ విసిరారు. రేవంత్ రెడ్డి నీకు నిజంగా దమ్ముంటే నువ్వు ముందుకురా అంటూ ఫైర్‌ అయ్యారు కేటీఆర్‌. నిపుణుల ముందు నువ్వు పెట్టిన సర్క్యులర్, క్రిశాంక్ పెట్టిన సర్క్యులర్ పెట్టి, ఏది ఒరిజినల్.. ఏది డూప్లికేట్ అనేది తేలుద్దామని రా అంటూ సవాల్‌ చేశారు. ఆ తర్వాత ఎవరు చంచల్ గూడ జైలులో కూర్చోవాలో కూడా తేలుద్దామన్నారు కేటీఆర్.

KTR challenged CM Revanth Reddy

కాగా నేడు చంచల్ గూడ జైలులో మన్నె క్రిశాంక్‌తో కేటీఆర్ ములాఖత్ అయ్యారు. చంచల్ గూడ జైలులో రిమాండ్‌లో ఉన్న బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా కన్వీనర్ క్రిశాంక్‌ను ఇవాళ ఉదయం 11 గంటలకు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరామర్శించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌ కు సవాల్‌ విసిరారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version