అమృత్ టెండర్ స్కాం..నిజం కాకపోతే.. రాజకీయ సన్యాసం తీసుకుంటా – కేటీఆర్‌

-

మంత్రి పొంగులేటి కి కేటీఆర్ సవాల్ విసిరారు. అమృత్ టెండర్ లలో తప్పు జరిగిందని.. నేను ఖచ్చితంగా నిరూపిస్తానని తెలిపారు. నిరూపించక పోతే పదవికి రాజీనామా కాదు.. రాజకీయ సన్యాసం చేస్తానని సవాల్‌ చేశారు కేటీఆర్. కేసీఆర్ నాయకత్వం లో పదేళ్ల లో సింగరేణి ఎంతో అభివృద్ధి చెందిందlr.. 1998 -99 నుంచి 2023 వరకు లాభలు చూస్తే అర్థం అవుతుందని వివరించారు.

KTR challenged Minister Ponguleti

2003 వరకు పాలించిన టీడీపీ ప్రభుత్వం లో 11 శాతం లాభాల వాటా ఇచ్చారని తెలిపారు. 2013 వరకు కాంగ్రెస్ ప్రభుత్వం లో 20 శాతం లాభాల వాటా ఇచ్చారని గుర్తు చేశారు. మా ప్రభుత్వం వచ్చే వరకు 400 కోట్ల ఆదాయం కూడా రాలేదన్నారు. మా ప్రభుత్వం వచ్చిన మొదటి ఏడాది లోనే 1000 కోట్ల ఆదాయం వచ్చిందని పేర్కొన్నారు. 2023 లో రెండు వేల కోట్ల ఆదాయం వచ్చింది.. దానిలో 32 శాతం లాభాల వాటా కార్మికుల కు ఇచ్చామన్నారు. నిన్న ప్రకటించింది దసరా పండుగ బోనస్ కాదు బోగస్ అంటూ ఆగ్రహించారు కేటీఆర్‌.

Read more RELATED
Recommended to you

Exit mobile version