బై‌డెన్‌తో మోడీ భేటీ.. కీలక అంశాలపై చర్చలు

-

మూడ్రోజుల పర్యటనలో భాగంగా అమెరికాలో ఉన్న ప్రధాని మోడీ క్యాన్సర్ మూన్ షాట్ కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఇండో-పసిఫిక్ దేశాలకు 40మిలియన్ల వ్యాక్సిన్ డోస్‌లు అందించి క్యాన్సర్ పోరాటంలో సాయం చేస్తామని మోడీ హామీ ఇచ్చారు. ‘వన్ ఎర్త్..వన్ హెల్త్ (ఒక దేశం..ఒకే ఆరోగ్యం) అనేది భారత్‌ విజన్. అందుకే మూన్‌షాట్‌ చొరవ కింద 7.5 మిలియన్ డాలర్ల విలువైన నమూనా కిట్‌లు, డిటెక్షన్‌ కిట్‌లతో పాటు వ్యాక్సిన్‌ల మద్దతును ప్రకటిస్తున్నాం. ఈ ప్రోగ్రాం చెపట్టిన ప్రెసిడెంట్ బైడెన్ కు ధన్యవాదాలు’ అని ప్రధాని పేర్కొన్నారు.’

అంతకుముందు డెలావేర్‌లో క్వాడ్ సమ్మిట్ సందర్భంగా బైడెన్‌తో మోడీ పర్సనల్‌గా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రక్షణ వ్యవహారాలకు సంబంధించి కీలక అంశాలపై చర్చించారు. ఎంక్యూ-98 ప్రెడెటర్ డ్రోన్ ఒప్పందం, కోల్‌కతాలో సెమీ కండక్టర్ ప్లాంట్ ఏర్పాటుతో సహా పలు అంశాలపై నేతలు చర్చించారు. ఇండో పసిఫిక్ ప్రాంతంతో సహా ప్రాంతీయ, ప్రపంచ సమస్యలపై ఇరువురు తమ అభిప్రాయాలను పంచుకున్నట్లు భారత విదేశాంగ శాఖ పేర్కొంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version