హైకోర్టులో కేటీఆర్ లంచ్ మోషన్ పిటిషన్..!

-

తెలంగాణ హైకోర్టు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ క్వాష్ పిటిషన్ నిన్న కొట్టేసిన విషయం తెలిసిందే. అయితే ఇవాళ హైకోర్టులో కేటీఆర్ లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్‌ను అనుమతించింది తెలంగాణ హైకోర్టు. అయితే ఇవాళ మధ్యాహ్నం 2:30కి విచారణ జరుగనుంది. అడ్వకేట్ సమక్షంలో విచారణకు అనుమతించాలని హైకోర్టులో పిటిషన్ వేసారు కేటీఆర్.

మరోవైపు ఫార్ములా ఈ రేసు కేసులో సుప్రీంకోర్టులో కూడా కేటీఆర్ నిన్న పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. మరోవైపు ప్రభుత్వం కూడా కేవియట్ పిటిషన్ వేసింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version