హైదరాబాద్ లో చంద్రబాబు మద్దతు ధరలు ధర్నాలు చేసుకోవచ్చు..కానీ – KTR

-

చంద్రబాబు మద్దతుదారులు… ధర్నా చౌక్ వద్ద ధర్నాలు చేసుకోవాలి అని మంత్రి కేటీఆర్ కీలక ప్రకటన చేశారు. నిన్న ఓ ప్రముఖ న్యూస్ ఛానల్ లో నిర్వహించిన ఇంటర్వ్యూలో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు అరెస్టుపై కీలక వ్యాఖ్యలు చేశారు మంత్రి కేటీఆర్. తనకు చంద్రబాబు, నారా లోకేష్ బాగా దగ్గరవారని… అలాగే పవన్ కళ్యాణ్ మరియు జగన్మోహన్ రెడ్డి కూడా కావాల్సినవారు అని తెలిపారు.

ktr-chandrababu

అయితే హైదరాబాదులో ఉన్న సెటిలర్స్, చంద్రబాబు మద్దతుదారులు మెట్రో రైల్లో నిరసన తెలపడం చాలా తప్పు అని వెల్లడించారు. నిరసన తెలిపాలంటే ధర్నా చౌక్ ఉందని… అక్కడ తమ నిరసనను ఎంతసేపైనా తెలుపుకోవచ్చని వివరించారు మంత్రి కేటీఆర్. కానీ సామాన్య ప్రజలకు ఇబ్బంది కలిగేలా ఎవరూ కూడా వ్యవహరించకూడదని… కోరారు. చంద్రబాబు అరెస్ట్ అనేది… వైసీపీ మరియు తెలుగుదేశం పార్టీల మధ్య ఉన్న వివాదం తో ముడిపడి ఉన్నదని వెల్లడించారు కేటీఆర్. కానీ ఆ వివాదాన్ని హైదరాబాదులో కొనసాగిస్తామంటే తాము అస్సలు ఒప్పుకోమని… తెలంగాణ చాలా ప్రశాంతంగా ఉండాలని మేము కోరుకుంటామని వివరించారు

Read more RELATED
Recommended to you

Exit mobile version