పనికిమాలిన పాలనలో పల్లె ప్రగతి లేదు.. పట్టణ ప్రగతి లేదంటూ రేవంత్ రెడ్డి సర్కార్ కేటీఆర్ ట్వీట్ చేశారు. ముందుచూపు లేని ముఖ్యమంత్రితో రాష్ట్రానికే అతీగతీ లేదని… “పల్లె ప్రగతి” వల్ల మొన్నటి దాకా మురిసిన పల్లెలు.. నేడు మురికి కూపాలను తలపిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. “పట్టణ ప్రగతి” తో పరుగులు తీసిన పట్టణాలు.. నేడు సమస్యలకు నిలయాలుగా మారుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు కేటీఆర్.
ఒకప్పుడు పల్లె కన్నీరు పెడుతుంది అని పాడుకున్నాం..ఇప్పుడు పట్టణాలు విలవిలలాడుతున్నై అని బాధపడే దుస్థితి ఉందన్నారు. ఈ మార్పు మాకొద్దు అనే నినాదం మొదలైంది.. కాంగ్రెస్ ను కూకటివేళ్లతో పెకిలించే రోజు దగ్గరపడిందని హెచ్చరించారు. తడిగుడ్డతో గొంతు కోయడం అంటే ఏంటో అనుకున్నాం కొనుగోళ్లు లేక తడుస్తున్న ఈ ధాన్యం చూస్తుంటే తెలుస్తుందని తెలిపారు. కళ్లు కాయలు కాసేలా ఎదురుచూడడం అంటే ఏంటో అనుకున్నాం కల్లాల వద్ద 20 రోజులుగా రైతన్నలు పడుతున్న బాధలు చూస్తే తెలుస్తుందని పేర్కొన్నారు కేటీఆర్.
పనికిమాలిన పాలనలో పల్లె ప్రగతి లేదు.. పట్టణ ప్రగతి లేదు…
ముందుచూపు లేని ముఖ్యమంత్రితో రాష్ట్రానికే అతీగతీ లేదు
“పల్లె ప్రగతి” వల్ల మొన్నటి దాకా మురిసిన పల్లెలు..
నేడు మురికి కూపాలను తలపిస్తున్నాయి“పట్టణ ప్రగతి” తో పరుగులు తీసిన పట్టణాలు..
నేడు సమస్యలకు నిలయాలుగా… pic.twitter.com/T05a06LXWT— KTR (@KTRBRS) November 7, 2024