హైదరాబాదీ నేను.. అట్లుంటది మనతోని : కేటీఆర్ ట్వీట్

-

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ పరిశ్రమలు, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ గురించి తెలియని వారుండరు. కేవలం మంత్రిగానే కాకుండా ఆయన సెన్సాఫ్ హ్యూమర్, స్పాంటేనిటీ, కాన్ఫిడెన్స్, క్లారిటీ, నాలెడ్జ్​కు చాలా మంది ఫిదా అవుతుంటారు. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఆయనకు ఫాలోవర్లు ఎక్కువే. సామాన్యులే కాదు.. సినీ, రాజకీయ, పారిశ్రామిక వేత్తలు ఆయణ్ను ఫాలో అవుతుంటారు. ఇక సోషల్ మీడియాలో ముఖ్యంగా ఎక్స్​లో యాక్టివ్​గా ఉండే కేటీఆర్ తరచూ నెటిజన్లతో ఇంటరాక్ట్ అవుతూ ఉంటారు.

ఇక నెటిజన్లు కూడా ఎక్స్ ద్వారా తమ సమస్యలను కేటీఆర్​ వద్దకు తీసుకెళ్తారు. అలాగే కేటీఆర్​కు ఏదైనా చెప్పాలన్నా.. ఏమైనా అడగాలన్నా సోషల్ మీడియానే మాధ్యమం చేసుకుంటున్నారు ప్రజలు. తాజాగా ఓ నెటిజన్ కేటీఆర్​ను పొగుడ్తూ ట్వీట్ చేశాడు. అయితే కేటీఆర్ రాజకీయ భవిష్యత్ గురించో.. లీడర్ షిప్ స్కిల్స్​ గురించో కాదు అతడు పొడిగింది. మరి దేని గురించి అనుకుంటున్నారా..?

కేటీఆర్ భాషా పరిణతి గురించి ఓ నెటిజన్ ట్వీట్ చేశాడు. ‘కేటీఆర్.. మీరు ఉర్దూ చాలా బాగా మాట్లాడుతున్నారు. స్వచ్ఛమైన ఉర్దూ మాట్లాడే నాయకులు అది కూడా తెలుగు వాళ్లు చాలా అరుదు. మీరు ఉర్దూ మీడియంలో చదువుకున్నారా’ అంటూ ఆ నెటిజన్ ట్వీట్ చేయగా కేటీఆర్ రిప్లై ఇచ్చారు. ‘నేను హైదరాబాదీని కదా.. హైదరాబాదీయులం కొంచెం ఉర్దూ.. కొంచెం హిందీ.. ఇంగ్లీష్ కూడా మాట్లాడ్తాం. మీ ప్రశంసకు నా కృతజ్ఞతలు’ అంటూ కేటీఆర్ రిప్లై ఇచ్చారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version