తెలంగాణ వామపక్ష, ప్రజా ఉద్యమాలకు అడ్డా – KTR

-

తెలంగాణ వామపక్ష, ప్రజా ఉద్యమాలకు అడ్డా అన్నారు భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ప్రభుత్వం తెచ్చిన తెలంగాణ సివిల్ కోర్ట్స్ అమెండ్ మెంట్ బిల్లు కు మద్దతిస్తూ అసెంబ్లీ మాట్లాడారు భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. తెలంగాణ సివిల్ కోర్ట్స్ అమెండ్ మెంట్ బిల్లు ను సమర్థిస్తూ ప్రభుత్వానికి మేము మద్దతిస్తున్నామని… శాంతి భద్రత విషయంలో విషయంలో రాజకీయాలకు అతీతంగా సమిష్టిగా మనం ఆలోచించాల్సిన అవసరముందని తెలిపారు.


అత్యాచారాలు, సైబర్ క్రైమ్ ల నేరాలను విచారించేందుకు ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. ప్రతి జిల్లాలో ఫాస్ట్ ట్రాక్ కోర్టు లు ఏర్పాటు చేసి బాధితులకు న్యాయం, నిందితులకు శిక్ష పడుతుందన్న నమ్మకం కలిగించాలన్నారు. ముఖ్యంగా లైంగిక వేధింపులు, అత్యాచారాల కేసుల్లో శిక్షలు వేగంగా పడేలా చర్యలు తీసుకోవాలని…. నేరాల ప్రవృత్తి మారుతోంది. అందుకు అనుగుణంగా చట్టాలను రూపొందించాల్సిన అవసరముందని చెప్పారు. ఇక ఇటీవల కేంద్రం తెచ్చిన న్యాయ చట్టాలు మనకు ఇబ్బందయ్యే పరిస్థితి కనిపిస్తోందన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version