తెలంగాణ సాగు విస్తీర్ణం ఢమాల్..కాంగ్రెస్‌ పై కేటీఆర్‌ సంచలన వ్యాఖ్యలు

-

తెలంగాణ సాగు విస్తీర్ణం ఢమాల్ అయిందని..కాంగ్రెస్‌ పై కేటీఆర్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ గారి పాలనలో సాగుకు స్వర్ణయుగం.. కాంగ్రెస్ రాగానే వ్యవసాయానికి గడ్డుకాలం అన్నారు. ఇది కాంగ్రెస్ సర్కార్ చేసిన.. కమాల్… తెలంగాణలో సాగు విస్తీర్ణం కళ్ళముందే.. ఢమాల్ అంటూ పోస్ట్‌ పెట్టారు. ఒక్క ఏడాదిలోనే.. 15.30 లక్షల ఎకరాల్లో సాగు విస్తీర్ణం తగ్గిందని తెలిపారు. ఆగమైతున్న తెలంగాణ రైతు బతుకుకు.. తొలి ప్రమాద సంకేతం అన్నారు. దశాబ్ద కాలంలోనే.. దేశానికే అన్నపూర్ణగా ఎదిగిన తెలంగాణలో..ఎనిమిది నెలల్లోనే..ఎందుకింత వ్యవసాయ విధ్వంసం..? అంటూ ఫైర్ అయ్యారు.

సంతోషంగా సాగిన సాగులో.. ఎందుకింత సంక్షోభం..?? అంటూ పేర్కొన్నారు. మొన్న.. వ్యవసాయానికి కరెంట్ కట్… నిన్న.. రుణమాఫీలో రైతుల సంఖ్య కట్…నేడు.. సాగయ్యే భూమి విస్తీర్ణం కట్ అంటూ కాంగ్రెస్‌ సర్కార్‌పై మండిపడ్డారు కేటీఆర్. రుణమాఫీ అని మభ్య పెట్టి..పెట్టుబడి సాయన్ని ఎగ్గొట్టడం వల్లే…. రైతులకు ఈ అవస్థ అన్నారు. రూ.500 బోనస్ అని..నిలువునా మోసం చేసింది ఈ కాంగ్రెస్ వ్యవస్థ అన్నారు. ముఖ్యమంత్రి మాటలు కోటలు దాటుతున్నయ్..కానీ చేతలు సచివాలయం గేటు దాటడం లేదన్నారు. ఆదిలాబాద్ నుంచి అలంపూర్ వరకు..అన్నదాతలది అత్యంత దయనీయ పరిస్థితి అని తెలిపారు.

https://x.com/KTRBRS/status/1822849467252445225

Read more RELATED
Recommended to you

Exit mobile version