బట్టలు ఉతకడానికి యువత మిలటరీలో చేరాలా కిషన్ రెడ్డి ? : కేటీఆర్

-

దేశ వ్యాప్తంగా అగ్నిపథ్‌ స్కీమ్‌ పై విమర్శలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే. అయితే.. ఇదే అంశంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పై తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి వర్యులు కేటీఆర్ ఫైర్ అయ్యారు. అగ్నిపథ్ స్కీమ్ లో చేరిన తర్వాత మిలటరీలో బట్టలు ఉతకవచ్చు ,కటింగ్ చేయవచ్చు అని చెప్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

బ్రహ్మాండంగా భవిష్యత్ ఉంటుందని అని కిషన్ రెడ్డి అంటున్నారని… దీని కోసo దేశ యువత మిలటరీ లో చేరాలా కిషన్ రెడ్డి ? అని నిలదీశారు మంత్రి కేటీఆర్‌. యువత అంత రోడ్డుమీదకు వచ్చి ఆందోళన చేస్తుంటే కేంద్రం పట్టించుకోదు…అగ్నిపథ్ అని దేశం యువత పొట్ట కొడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

అగ్నిపథ్ ను వ్యతిరేకిస్తూ ఆందోళన చేస్తుంటే వారిని దేశ ద్రోహులు అంటూ అవమానిస్తున్నారని నిప్పులు చెరిగారు మంత్రి కేటీఆర్. కేంద్ర ప్రభుత్వం ఈ విషయంపై నిమ్మకు నీరెత్తినట్లు ఉందని మండిపడ్డారు. వెంటనే అగ్నిపథ్‌ స్కీమ్‌ రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు కేటీఆర్‌.

Read more RELATED
Recommended to you

Exit mobile version