దేశంలోనే తొలి సోలార్ సైక్లింగ్ ట్రాక్‌ను ప్రారంభించారు తెలంగాణ మంత్రి కేటీఆర్. నిన్నరాత్రి హైదరాబాద్ లోని తొలి సోలార్ సైక్లింగ్ ట్రాక్‌ను ప్రారంభించారు తెలంగాణ మంత్రి కేటీఆర్.ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. మన లైఫ్ స్టయిల్ మారాల్సిన అవసరం ఉందని.. ఆరోగ్యంపై అందరు దృష్టి సారించాలని కోరారు. డబ్బు సంపాదించినకొద్దీ హెల్త్ పై అవర్నెస్ తగ్గిపోతుందని.. లగ్జరీ లైఫ్ కావాలనుకుంటు హెల్త్ ని పట్టించుకోట్లేదన్నారు.
ఇంట్లో నుంచి బయటికొస్తే అది కార్ లేదా బైక్ వాడుతున్నారని.. కానీ విదేశాల్లో లాగ మనదగ్గర కూడా సైకిల్స్ వాడాలని పిలుపునిచ్చారు.అందుకోసమే ఈ ట్రాక్ ఏర్పాటు చేసామని… ఇది ఒక్క అడుగు మాత్రమే… సిటీ మొత్తం ట్రాక్ ఏర్పాటు చెయ్యాలి. అది నా డ్రీమ్ అని తెలిపారు. సైక్లింగ్ కి హైదరాబద్ ని డెస్టినేషన్ చేస్తామన్నారు. జనాల్లో చాలా మందికి సివిక్సేన్స్ లేకుండా పోయింది… ఈ మాట అన్నందుకు నన్ను యూట్యూబ్ లో ఆడుకుంటారు. అయినా ఇది నిజం కాబట్టి చెప్తున్నానన్నారు. ఈ ట్రాక్ అందరు ఉపయోచించుకోవచ్చని… సోలార్ వల్ల 16 మెగా వాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుందని తెలిపారు మంత్రి కేటీఆర్.