తెలంగాణలో ఆద్యకళా ప్రదర్శనశాల ఏర్పాటు.. మంత్రి కేటీఆర్‌ హామీ

-

18 ఆదివాసీ తెగలు… 60 కులాలు, ఉపకులాల జీవితాలకు అద్దంపట్టే ఆద్యకళా వారసత్వ సందప ప్రదర్శనశాల ఏర్పాటుకు తెలంగాణ ప్రభుత్వం త్వరలోనే శ్రీకారం చుట్టబోతున్నట్లు తెలుస్తోంది. ఆదివాసీల జానపద, సంస్కృతికి చిహ్నమైన ఆద్యకళా ప్రదర్శనశాల ఏర్పాటుకు రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కేటీ రామారావు హామీ ఇచ్చారు. చరిత్రకారుడు, కవి, ఆచార్య జయధీర్‌ తిరుమలరావు సేకరించిన అరుదైన కళాకృతుల వీడియోను ఒక నెటిజన్‌ మంత్రికి ట్విటర్‌ ద్వారా పంపగా… దీనికి సాయం అందిస్తామని కేటీఆర్‌ తెలిపారు.

అనంతరం రాష్ట్ర సాంస్కృతిక పర్యాటక శాఖల మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్‌ స్పందించారు. తెలంగాణ చారిత్రక కళాసంపద పరిరక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, త్వరలోనే తమ అధికారుల బృందం తిరుమలరావును కలిసి ఆద్యకళా ప్రదర్శనశాలకు ఏర్పాట్లు చేస్తుందన్నారు. తిరుమలరావు మంత్రులు కేటీఆర్‌, శ్రీనివాస్‌గౌడ్‌లకు కృతజ్ఞతలు తెలిపారు.

45 ఏళ్లుగా ఆది ధ్వని ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో తెలంగాణ చరిత్ర, సామాజిక, సాంస్కృతిక రంగాలకు చెందిన 4500 ఆద్య కళాఖండాలు, వాయిద్యాలు, దైవ ప్రతిమలు, పరికరాలు, తాళపత్రాలను సేకరించామని తిరుమలరావు అన్నారు. వీటితో అయిదు ప్రదర్శనశాలలను ఏర్పాటు చేయవచ్చని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version