తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ నేడు కరీంనగర్ లో పర్యటించనున్నారు. కరీంనగర్ పట్టణంలో పలు అభివృద్ధి పనులకు మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేయనున్నారు. అలాగే ఇప్పటికే నిర్మించిన భవనాలను మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నారు. ఈ రోజు ఉదయం 11:00 గంటలకు కరీంనగర్ పట్టణానికి చేరుకుంటారు. మానేరు వంతెన పై మిషన్ భగీరథ వాటర్ పైలాన్ ను ప్రారంభిస్తారు. 24 గంటల పాటు మంచి నీటిని సరఫరా చేయడానికి రూ. 410 కోట్ల నిధులతో మానేరు రివర్ ఫ్రంట్ పనులకు శంకుస్థాపన చేస్తారు.
అనంతరం 11:30 గంటలకు మార్క్ ఫెడ్ ఆధ్వర్యంలో రూ. 615 కోట్లతో చేస్తున్న వివిధ అభివృద్ధి పనులకు మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేస్తారు. అనంతరం అక్కడే నిర్వహిస్తున్న బహిరంగ సభలో మంత్రి కేటీఆర్ ప్రసంగిస్తారు. అనంతరం 1:00 గంటలకు చొప్పదండి కి చేరుకుంటారు. అక్కడ రూ. 38 కోట్ల తో చేపడుతున్న పలు అభివృద్ధి పనులకు భూమి పూజా చేస్తారు. మళ్లీ కరీంనగర్ పట్టణానికి 4 :00 గంటలకు చేరుకుని ఉజ్వల పార్క్ సమీపంలో రూ. 5 కోట్లతో నిర్మించిన బీసీ స్టడీ సర్కిల్ భవనాన్ని ప్రారంభిస్తారు.
అనంతరం మున్సిపల్ అధికారులతో, జిల్లా అధికారులతో సమావేశం అవుతారు. కాగ కరీంనగర్ జిల్లాకు కేటీఆర్ వస్తున్న నేపథ్యంలో నగరం మొత్తం గులాభి మయం అయింది. కేటీఆర్ నగరానికి చేరుకోక ముందే.. ఉదయం 10:00 గంటలకు భారీ బైక్ ర్యాలీ చేయనున్నారు. బైక్ ర్యాలీ తో కేటీఆర్ కు స్వాగతం పలకనున్నారు.