కాంగ్రెస్‌ ప్రభుత్వం మరిన్ని మల్టీలెవల్‌ కార్‌ పార్కింగ్‌ బిల్డింగ్‌లను కట్టాలి: కేటీఆర్‌

-

బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఎక్స్ వేదికగా మరోసారి కాంగ్రెస్ ప్రభుత్వంపై పోస్టు పెట్టారు. ఈసారి ఆయన రేవంత్ సర్కార్ కు ఓ రిక్వెస్ట్ చేశారు. మల్టీలెవల్‌ కార్‌ పార్కింగ్‌ విధానాన్ని కాంగ్రెస్‌ ప్రభుత్వం ముందుకు తీసుకువెళ్లాలని ఆయన విజ్ఞప్తి చేశారు. తాజాగా పూర్తి స్థాయి ఆటోమేటెడ్‌, కంప్యూటరైజ్డ్‌ మల్టీ లెవల్ కార్‌ పార్కింగ్‌ (ఎంఎల్‌సీపీ) పనులు దాదాపు పూర్తి కావడం పట్ల బీఆర్‌ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ హర్షం వ్యక్తం చేశారు. పీపీపీ విధానంలో నాంపల్లి మెట్రో స్టేషన్‌ సమీపంలో ఈ మల్టీలెవల్‌ కారు పార్కింగ్‌ను నిర్మించాలని 2016/17లో నిర్ణయించామని.. కానీ కొన్ని కారణాల వల్ల ఆలస్యమైన ఈ ప్రాజెక్టు ఎట్టకేలకు పూర్తి కావచ్చిందని అన్నారు.
ఇటువంటి మల్టీలెవల్‌ కార్‌ పార్కింగ్‌ విధానాన్ని కాంగ్రెస్‌ ప్రభుత్వం మరింత ముందుకు తీసుకెళ్లాలని కేటీఆర్‌ విజ్ఞప్తి చేశారు. ముఖ్యమైన జంక్షన్లు, మెట్రో స్టేషన్లు, కమర్షియల్‌ సెంటర్లకు సమీపంలో ఇలాంటివి మరిన్ని కట్టాలని కేటీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు.

 

 

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version