తెలంగాణకు మరో గ్లోబల్ కంపెనీ.. రూ.225 కోట్లు పెట్టుబడి పెట్టనున్న టీసీఎల్ గ్లోబల్

-

తెలంగాణలో పెట్టుబడి పెట్టేందుకు మరో గ్లోబల్ కంపెనీ ముందుకు వచ్చింది. ప్రముఖ ఎలక్ట్రానిక్స్ సంస్థ టీసీఎల్ గ్లోబల్ సంస్థ రాష్ట్రంలో వాషింగ్ మిషన్ల తయారీ యూనిట్​ను ఏర్పాటు చేయనుంది. రీసోజెట్​తో కలిసి సంయుక్తంగా నెలకొల్పనున్న ఈ యూనిట్ కోసం ప్రాథమికంగా 225 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టనున్నారు. కొత్త యూనిట్ ద్వారా 500 స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.

టీసీఎల్ గ్లోబల్ కంపెనీ తయారీ యూనిట్ ఏర్పాటు నిర్ణయంపై పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. ప్రపంచంలోని అతిపెద్ద ఎలక్ట్రానిక్స్ తయారీ కంపెనీల్లో ఒకటైన టీసీఎల్ గ్లోబల్ యూనిట్ ఏర్పాటు సంతోషకరమని అన్నారు. కంపెనీ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు ట్వీట్ చేశారు. టీసీఎల్​తో కలిసి సంయక్తంగా యూనిట్ ఏర్పాటు చేస్తున్న రీసోజెట్​కు కేటీఆర్ అభినందనలు తెలిపారు. కొత్త యూనిట్​లో వాషింగ్ మిషన్లు తయారు చేస్తారని, భవిష్యత్ లో రిఫ్రిజిరేటర్ల తయారీకి కూడా విస్తరించాలన్న ప్రణాళికలు ఉన్నాయని మంత్రి కేటీఆర్ వెల్లడించారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version