అమరరాజా కంపెనీ జయదేవ్ పై కేటీఆర్ కీలక వ్యాఖ్యలు !

-

అమరరాజా కంపెనీ జయదేవ్ పై మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రతిరోజు కొత్తదనం ఉండేలా అమరరాజా కృషి చేస్తుందని.. అమరాజా కోసం తెలంగాణలో భారీ ఎత్తున పెట్టుబడులు పెడుతున్న జయదేవ్ కు ప్రత్యేక ధన్యవాదాలు చెప్పారు మంత్రి కేటీఆర్‌. జీఎంఆర్ ఏరోసిటీలో రెండు రోజుల కిందట కోల్డ్ చైన్ సెంటర్ ను ప్రారంభించుకున్నామన్నారు.

ఇప్పుడు ఎనర్జీ రీసెర్చ్ సెంటర్ ను ప్రారంభించుకోవడం ఆనందంగా ఉందని…భవిష్యత్ అంతా సస్టెనెబులిటీదేనని తెలిపారు. అందులో అమరరాజా ముందుకు దూసుకెళ్తుందని.. టీఎస్ ఇన్నోవేషన్ ప్రతిభావంతులైన యువతను గుర్తిస్తుందని పేర్కొన్నారు. 2030 నాటికి 60 శాతం ఈ-బ్యాటరీలు దేశంలోనే తయారవుతాయన్నారు. తెలంగాణ ప్రభుత్వం మొబిలిటీ వ్యాలిని ప్రారంభించిందన్నారు. ఎలక్ట్రికల్ లో తెలంగాణ దేశంలోనే మొదటి స్థానంలో ఉంటుందన్నారు కేటీఆర్‌.

Read more RELATED
Recommended to you

Exit mobile version