వారెవ్వా రజినీ: మొదటి రోజు రికార్డ్ కలెక్షన్ లతో దుమ్ములేపిన “జైలర్” !

-

నిన్న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్ లలో చాలా గ్రాండ్ గా రిలీజ్ అయిన మూవీ “జైలర్”. ఇందులో రజినీకాంత్, మోహన్ లాల్ , శివ రాజ్ కుమార్ , తమన్నా లాంటి స్టార్ కాస్ట్ తో డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ సినిమాపై అంచనాలు భారీగా పెంచేశాడు. అందుకు తగిన విధంగానే జైలర్ మూవీ నిన్న మొదటి షో నుండి పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది. ప్రేక్షకులు ఏమైతే రజినీ సినిమా నుండి ఆశిస్తారో అవన్నీ పుష్కలంగా ఉండడంతో బ్రహ్మరధం పడుతున్నారు. ఇక ఒక్క రోజు పూర్తి కావడంతో ట్రేడ్ పండితుల నుండి మొదటి రోజు జైలర్ సినిమాకు ఏ మాత్రం కలెక్షన్ లు వచ్చాయన్నది సమాచారం అందింది. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 95 .78 కోట్లు కలెక్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఇక తమిళనాడు లో రూ. 29 .46 కోట్లు కలెక్ట్ చేయగా , తెలుగు రాష్ట్రాలలో రూ. 11 .92 కోట్లు కలెక్ట్ చేసింది.. ఇక విదేశాలలో రూ. 32 .75 కోట్లు కలెక్ట్ చేశాయి..

ఇక ఈ రోజు రిలీజ్ అయిన భోళా శంకర్ మూవీ కూడా మిక్సెడ్ టాక్ తెచ్చుకోవడంతో ఇక జైలర్ మూవీకి కలెక్షన్ లు బాగుంటాయని చిత్రబృందం నమ్ముతోంది.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version