కురుమూర్తి క్షేత్రం అంటే మరో తిరుపతి.. సీఎం రేవంత్ రెడ్డి

-

కురుమూర్తి క్షేత్రం అంటే మరో తిరుపతి అన్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. అమ్మాపురంలోని కురుమూర్తి వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్న అనంతరం పలు అభివృద్ధి పనులకు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, దామోదర రాజనర్సింహలతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు కొండపైకి రోడ్డుకు రూ.110కోట్లు కేటాయించినట్టు తెలిపారు. త్వరలోనే మక్తల్-నారాయణపేట ప్రాజెక్ట్ ప్రారంభిస్తామని తెలిపారు. 

కేసీఆర్ పదేళ్ల పాలనలో ఏ ప్రాజెక్ట్ పూర్తి కాలేదు. అన్ని ప్రాజెక్ట్ లు పూర్తి చేయడానికి అడుగులు వేస్తున్నాం. కొంత మంది కళ్లలో నిప్పులు పోసుకుంటున్నారు. మా జిల్లాలో అభివృద్ధి పనులను ఎవ్వరైనా అడ్డుకోవాలని చూస్తే.. జిల్లా యువత వారిని అడ్డుకుంటారని తెలిపారు. కేసీఆర్ ను పాలమూరు ప్రజలే పార్లమెంట్ కు పంపారని గుర్తు చేశారు. పాలమూరుకు మేము నిధుల వరద పారిస్తామని తెలిపారు. నా మీద కోపంతో జిల్లా అభివృద్ధికి అడ్డుపడకండి అని సూచించారు.   తాను ఎక్కడికి పోయినా ఏ దేశం పోయినా నా సొంత జిల్లా అభివృద్ది చెందాలని కోరుకుంటున్నానని తెలిపారు. 

Read more RELATED
Recommended to you

Exit mobile version