కాంగ్రెస్ కు సినిమా చూపిస్తామంటున్న బీఆర్ఎస్.. భారీ స్కెచ్ సిద్దం..

-

ఇప్పటివరకు బీఆర్ఎస్ పోరాటాలు వేరు.. ఇక నుంచి వేరు అంటున్నారు ఆ పార్టీ నేతలు.. వచ్చె నెల నుంచి హస్తం నేతలకు సినిమా చూపిస్తామని సవాళ్లు విసురుతున్నారు.. ఫామ్ హౌస్ నుంచి గులాబీ బాస్ వ్యూహాలు రచిస్తుంటే.. వాటిని పొలిటికల్ గ్రౌండ్ లో కేటీఆర్, హరీష్ రావులు అమలు చేస్తున్నారు.. కాంగ్రెస్ పార్టీని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు.. ఈ క్రమంలో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు మరో భారీ కార్యక్రమానికి ఆ పార్టీ సిద్దమవుతున్నట్లు బీఆర్ఎస్ సర్కిల్ లో చర్చ నడుస్తోంది..

టార్గెట్ కాంగ్రస్ అన్నట్లుగా డే వన్ నుంచి బీఆర్ఎస్ నేతలు పోరాటాలు చేస్తూనే ఉన్నారు.. అధికార పార్టీ చేసే కార్యక్రమాలపై, నేతలపై విమర్శలజడిని పెంచేస్తున్నారు. తాము ప్రజలకు మంచి చేస్తున్నామని కాంగ్రెస్ చెబుతుంటే.. అక్రమాలను కప్పిపుచ్చుకునేందకు భారీ ప్రాజెక్టులకు రూపకల్పన చేస్తున్నారని బీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు.. ఇదిలా ఉంటే.. కాంగ్రెస్‌ పవర్‌లోకి వచ్చి 11 నెలలు గడిచిపోయాయి.. ఇంకో నెల అయితే ఏడాది అవుతుంది. ఈ క్రమంలో వన్‌ ఇయర్ ప్రొటెస్ట్‌ దద్దరిల్లేలా ప్లాన్ చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది..

గులాబీ బాస్ కేసీఆర్ కూడా అదే రోజు పొలిటికల్ రీ ఎంట్రీ ఇవ్వబోతున్నారనే ప్రచారం జరుగుతోంది..
రుణమాఫీ, 4 వేల పెన్షన్, మహిళలకు నెలకు 2500, ఉద్యోగాల భర్తీపై గట్టిగనే పోరాడాలని గులాబీ బాస్ ఫిక్స్ అయ్యారట. తెలంగాణ ఉద్యమ తరహాలో పోరాటాలు ఉంటాయని క్యాడర్ చర్చించుకుంటోంది..
ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు..వాటి అమలు, ప్రభుత్వం తీరును ప్రజల్లోకి తీసుకెళ్లేలా ప్లాన్ రెడీ చేస్తోందట.. ఈ ఏడాది సమయంలో కాంగ్రెస్ పార్టీ వల్ల నష్టపోయిన వర్గాలను కూడా తీసుకురావాలని, వారి చేత మాట్లాడించాలని బీఆర్ఎస్ నేతలు భావిస్తున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి.. ఏడాది తర్వాత నుంచి మరింత దూకుడుగా ప్రజల్లోకి వెళ్లాలని.. ఇది లోకల్ బాడీ ఎన్నికల్లో కూడా పార్టీకి మైలేజ్ తెస్తుందని గులాబీ బాస్ ఆలోచిస్తున్నట్లు పార్టీవర్గాలు చెబుతున్నాయి.. మొత్తంగా ఏడాది తర్వాత కేసీఆర్ మళ్లీ బయటికి రాబోతున్నారన్నమాట..

Read more RELATED
Recommended to you

Exit mobile version