వర్షాల ఎఫెక్ట్.. ఆరోగ్యశాఖ సిబ్బందికి సెలవులు రద్దు

-

తెలంగాణలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు, వరదల నేపథ్యంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. వర్షాల నేపథ్యంలో ప్రజలు వ్యాధుల బారిన పడే అవకాశమున్నందున సిబ్బందికి సెలవులు రద్దు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు అన్ని జిల్లాల DMHOలకు.. ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ శ్రీనివాస రావు ఆదేశాలు జారీ చేశారు. అత్యవసర పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో వైద్య సిబ్బందికి సెలవులు ఇవ్వొద్దని… ఇప్పటికే లీవ్ లో ఉన్నవారి సెలవులను సైతం రద్దు చేయాలని ఆదేశాల్లో పేర్కొన్నారు.

రాష్ట్రంలోని ఆస్పత్రులన్నీ పూర్తి సిబ్బందితో పని చేయాలని డీహెచ్​ పేర్కొన్నారు. స్థానిక పరిస్థితులను పర్యవేక్షించుకుంటూ… అవసరమైన వైద్య సేవలు అందించాలని స్పష్టం చేశారు. ఎమర్జెన్సీ విభాగాలు….. 24 గంటలు పూర్తి సేవలు అందించాలని సూచించారు. రాష్ట్ర స్థాయిలో ఓ కాల్ సెంటర్ ఏర్పాటు చేసినట్టు తెలిపారు. రక్త నిల్వలు అందుబాటులో ఉంచుకోవాలని బ్లడ్ బ్యాంకులను డీహెచ్ ఆదేశించారు. గత వారం రోజులుగా రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Exit mobile version