బరాబర్ బీఆర్ఎస్ ను బొంద పెడతాం.. మంత్రి కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు

-

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తాజాగా మరోసారి ఫైర్ అయ్యారు. అధికారం కోల్పోయిన షాక్ కేటీఆర్ పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఆదివారం యాదాద్రి జిల్లాలో కోమటిరెడ్డి మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ హామీ ఇచ్చిన ఆరు గ్యారెంటీ స్కీమ్ లను 100 రోజుల్లో అమలు చేస్తామని చెప్పామని.. తాము అధికారంలోకి వచ్చి ఇప్పటికీ 40 రోజులు మాత్రమే అయిందన్నారు.

అధికారంలోకి వచ్చిన రెండు రోజుల్లోనే రెండు స్కీమ్ లను ప్రారంభించామని గుర్తు చేశారు. ఉచిత కరెంట్ విషయంలో ఆలోచించి మాట్లాడాలని కేటీఆర్ కి సూచించారు. బీఆర్ఎస్ నేతలు అప్పుడే ప్రభుత్వం పై విమర్శలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణను అప్పుల కుప్పగా మార్చిందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అవినీతి సొమ్ముతో 20 సంవత్సరాల పాటు ప్రజలకు సంక్షేమ పథకాలు అమలు చేయవచ్చన్నారు. సీఎం రేవంత్ రెడ్డి అన్నట్టుగా బరాబర్ బీఆర్ఎస్ ను బొందపెడతామని కోమటిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version