కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడే మేడిగడ్డ కుంగిపోయింది : మంత్రి ఉత్తమ్

-

కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడే మేడిగడ్డ కుంగిపోయిందని తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. తాజాగా ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. కమీషన్ల కోసమే కేసీఆర్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేపట్టిందని ఆరోపించారు. తుమ్మిడి హట్టి వద్ద నిర్మించాల్సిన ప్రాజెక్టును రీ డిజైన్ పేరుతో మరో చోటుకు మార్చారని పేర్కొన్నారు.

ఎక్కువ వడ్డీకి రుణాలు తీసుకు వచ్చి రూ.లక్ష కోట్ల ప్రజాధనం వృథా చేశారని విమర్శించారు. మేడిగడ్డ ఫౌండేషన్ ఆరు అడుగులు కుంగిపోయింది. కేసీఆర్, కేటీఆర్ కంటే మేధావులతో తాము ప్రాజెక్టు మరమ్మత్తు పనులు చేపడుతున్నామని తెలిపారు. సోమవారం అధికారులతో సమావేశంలో పలు కీలక విషయాలను వెల్లడించనున్నట్టు తెలిపారు. బీఆర్ ఎస్ ప్రభుత్వం చేసిన తప్పులతో రాష్ట్రానికి తీవ్ర నష్టం వాటిల్లిందని తెలిపారు. మేడిగడ్డ ప్రాజెక్ట్ కి తమ ప్రభుత్వం ఖర్చు చేయలేదని తెలిపారు. ఉమ్మడి  ఆదిలాబాద్ జిల్లాలో తుమ్మడిహట్టి వద్ద ప్రాజెక్ట్ నిర్మిస్తే.. ఖర్చు చాలా తక్కువగా వచ్చేదని తెలిపారు. 

Read more RELATED
Recommended to you

Exit mobile version