బీజేపీ-బీఆర్ఎస్ విలీన ప్రక్రియ మొదలైంది..అందుకే కవితకు బెయిల్‌ – కాంగ్రెస్‌

-

బీజేపీ-బీఆర్ఎస్ విలీన ప్రక్రియ మొదలైంది..అందుకే కవితకు బెయిల్‌ వచ్చిందని సంచలన వ్యాఖ్యలు చేశారు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్. కవిత కు బెయిల్ ఊహించిందేనని… బీజేపీ, బిఆర్ఎస్ కుమ్మక్కుతోనే బెయిల్ వచ్చిందని బాంబ్‌ పేల్చారు. మొన్నటి వరకు చీకటి ఒప్పందాలతో కాంగ్రెస్ ను దెబ్బతీయాలని చూసారని ఆగ్రహించారు.

mahesh goud reacts on kavitha bail

పార్లమెంట్ ఎన్నికల్లో బిఆర్ఎస్ బీజేపీ కుమ్మక్కు అయ్యి బిజెపి కి బిఆర్ఎస్ దాసోహం అయ్యిందన్నారు. హరిశ్, కేటిఆర్ లు ఢిల్లీలో బీజేపీ నేతల చుట్టూ ఆపద మొక్కులు మొక్కారని చురకలు అంటించారు. బీజేపీ నేతల ఇళ్ల చుట్టూ తిరిగి కాళ్ళ మీద పడి కవితకు బెయిల్ తెచ్చుకున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలి.. బీజేపీ, బిఆర్ఎస్ లు కుమ్మక్కు రాజకీయాలు బయటపడ్డాయన్నారు. బీజేపీ లో బిఆర్ఎస్ విలీన ప్రక్రియ మొదలు అవుతుందని వెల్లడించారు. ఇంకా బీజేపీ లో బిఆర్ఎస్ విలీనం ఒక్కటే మిగిలిందని సెటైర్లు పేల్చారు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్..

 

Read more RELATED
Recommended to you

Exit mobile version