పోర్న్ వీడియోలో నటిస్తే డబ్బులిస్తానని నమ్మబలికి.. మత్తులోకి దించి.. నగ్నంగా చిత్రీకరించి..

-

అవసరాన్ని ఆసరాగా చేసుకుని డబ్బిస్తానని నమ్మబలికి ఓ వెబ్​సైట్​కు అవసరమైన వీడియోలో ముఖాన్ని కప్పేసి.. నగ్నంగా నటిస్తే రూ.లక్షలు ఇస్తానంటూ ఓ వివాహితను నమ్మించాడు ఓ వ్యక్తి. డబ్బు కోసం దానికి అంగీకరించిన ఆమెను మద్యం మత్తులోకి దించి నగ్నంగా చిత్రీకరించాడు. అనంతరం ఆ వీడియోను చూపించి బెదిరించి డబ్బులు డిమాండ్ చేశాడు. దీంతో ఆమె పంజాగుట్ట పోలీసులను ఆశ్రయించింది.

విశాఖపట్నానికి చెంది దిల్‌సుఖ్‌నగర్‌లో ఉంటున్న వివాహిత(26) వివాహ వేడుకల ఏర్పాట్లు చేస్తుంటుంది. నాలుగేళ్ల క్రితం బోనాల చెన్నకేశవ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. నెలక్రితం ఆమెకు ఫోన్‌చేసి, తనకు తెలిసిన వెబ్‌సైట్‌ ఉందని, ముఖానికి స్కార్ఫ్‌ ధరించి నీలిచిత్రంలో నటిస్తే నిర్వాహకులు రూ.10లక్షలు ఇస్తారని తెలిపాడు. ఆర్థిక అవసరాల నేపథ్యంలో అతడి మాటలు నమ్మి.. పంజాగుట్టలోని ఓ హోటల్‌లో గదికి అతడు చెప్పినట్టుగానే వెళ్లింది. ఆమెను మద్యం తాగమనగా నిరాకరించడంతో.. మరో డ్రింక్‌లో మద్యం కలిపి తాగించాడు. మత్తులోకి వెళ్లాక నగ్నంగా వీడియో తీసి. కొద్దిరోజుల తరువాత మళ్లీ ఫోన్‌ చేసి, రూ.లక్ష ఇవ్వాలని, లేదంటే నగ్న వీడియోలు వెబ్‌సైట్‌లో పెడతానని బెదిరించడం మొదలు పెట్టాడు. రోజురోజుకు బెదిరింపులు పెరగడంతో ఈనెల2న ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version