ఇవాళ తెలంగాణ బంద్ కు మావోయిస్టుల పిలుపు

-

రెండు రోజుల కిందట మహారాష్ట్ర రాష్ట్రంలోని  గడ్చిరౌలి జిల్లాలో జరిగిన ఎన్ కౌంటర్ జరిగిన విషయం తెలిసిందే. ఈ ఎన్ కౌంటర్ లో ముగ్గురు మావోయిస్టులు మరణించారు. ఈ ఎన్ కౌంటర్ ని నిరసిస్తూ ఇవాళ మావోయిస్టు పార్టీ తెలంగాణ బంద్ కి పిలుపునిచ్చింది. కాల్పులను బూటకపు ఎన్ కౌంటర్ గా అభివర్ణించింది. పోలీసులు జరిపిన ఎన్ కౌంటర్లపై హైకోర్టు న్యాయమూర్తితో విచారణ జరిపించాలని డిమాండ్ చేసింది. మరోవైపు నిన్న కూడా ఛతీస్ గడ్ లో ఎన్ కౌంటర్ లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. 

ఈ ఎన్ కౌంటర్ లో పాల్గొన్న వారిపై సెక్షన్ 302 కింద కేసు నమోదు చేయాలని కోరింది. స్వచ్ఛందంగా బంద్ ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చింది. మార్చి 19వ తేదీన మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో నలుగురు మావోయిస్టులు మృతిచెందారు. చనిపోయిన వారిపై రూ.36 లక్షల నగదు బహుమతి రివార్డు ఉండటం గమనార్హం.

Read more RELATED
Recommended to you

Exit mobile version