మరో నాలుగు రోజుల్లో పెళ్లి.. ఇంతలోనే పెళ్లి కొడుకు మృతి..!

-

మరో నాలుగు రోజుల్లో ఆ ఇంట్లో పెళ్లి, బంధుగణంతో ఆ ఇంట సందడి నెలకొంది. పెండ్లి పనుల కోసం ఇంటిల్లిపాది నిమగ్నమయ్యారు. ఇంతలోనే అనుకోని విషాదం నెలకొంది. ఆదివారం పెండ్లి చేసుకోవాల్సిన యువకుడు వినోద్‌ కుమార్‌ విద్యుదాఘాతంతో మృతి చెందాడు.

ఈ విషాదకర సంఘటన నిర్మల్ జిల్లా కడెం మండలం చిన్నబెల్లాపూర్లో బుధవారం చోటు చేసుకుంది. వినోద్‌ స్నానానికి వెళ్లిన సమయంలో గీజర్‌కు కరెంట్ షాక్‌ రావడంతో అక్కడికక్కడే మృతి చెందడు. మంగళవాయిధ్యాలు మోగాల్సిన చావు డప్పు మోగాల్సి రావడంతో వరుడి తల్లిదండ్రులు, బంధువుల రోదనలు మిన్నంటాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version