ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు మరోసారి ఈడీ నోటీసులు

-

ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్, ఈడీ మధ్య పంచాయితీ ఇంకా తెగలేదు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న విచారించేందుకు ఈడీ కేజ్రీవాల్ కు నోటీసులు పంపుతున్న.. కేజ్రీవాల్ మాత్రం ఈడీ ఇచ్చిన నోటీసులను పక్కకి పెట్టి తన రాజకీయ కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. తాజాగా ఆరో సారి కూడా లిక్కర్ స్కాం కేసులో విచారణకు హాజరు కావాలని ఈడీ కేజ్రీవాల్ కు నోటీసులు పంపింది.

ఈ నెల 19న ఢిల్లీలోని ఈడీ కార్యాలయానికి రావాలని నోటీసుల్లో పేర్కొంది. అయితే… ఐదు సార్లు ఈడీ నోటీసులు పంపిన పట్టించుకోని కేజ్రీవాల్.. విచారణకు హాజరు అవుతారా? లేదా? అనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ వ్యవహారంపై కోర్టుకు వెళ్ళింది ఈడీ. లిక్కర్ స్కాం కేసులో విచారణకు రావాలని ఐదు సార్లు సీఎం కేజ్రీవాల్ కు నోటీసులు పంపింది ఈడీ. అయితే.. కేజ్రీవాల్ మాత్రం ఈడీ నోటీసులను పక్కకు పెట్టి విచారణకు రాలేదు. మొత్తం ఐదు సార్లు కూడా విచారణకు కేజ్రీవాల్ డుమ్మా కొట్టడంతో రౌస్ అవెన్యూ కోర్టును ఆశ్రయించింది ఈడీ.

Read more RELATED
Recommended to you

Exit mobile version