తెలంగాణ లో భారీగా ఏసీపీ అధికారులు బదిలీ

-

తెలంగాణ అధికారుల బదిలీ పర్వం కొనసాగుతోంది. లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల సంఘం సూచన మేరకు ఈ బదిలీలు జరుగుతున్నాయి. పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడుతుండడంతో రాష్ట్రంలోనే పలు కీలక శాఖలో భారీగా బదిలీలు జరుగుతున్నాయి. ఈ తరుణంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 61 మంది ఏసీపీ అధికారులను బదిలీ చేస్తున్నట్టు డీజీపీ రవి గుప్త ఉత్తర్వులు జారీ చేశారు. ఇదిలా ఉంటే.. శనివారమే 12 మంది అడిషనల్ ఎస్పీలను బదిలీ చేశారు. ఎన్నికల సంఘం సూచనలతో ప్రభుత్వ అధికారులు ఇప్పటికే మున్సిపల్ కమిషనర్లు, డీఎస్పీలు, ఆర్డీవోలు, ఐపీఎస్ అధికారులు, అడిషనల్ కలెక్టర్లను బదిలీ చేశారు.


ఇదిలా ఉండగా..  62 మంది డిఎస్పీలను బదిలీ చేశారు. ఇప్పటికే ఐఏఎస్ ఐపీఎస్ లతో పాటు వివిధ శాఖల్లోని పలువురు అధికారులను ట్రాన్స్ఫర్ చేయగా.. తాజాగా పోలీస్ శాఖలో మరోసారి పెద్ద ఎత్తున బదిలీలు జరిగాయి. ఆదివారం 62 మంది డిఎస్పీలను ప్రభుత్వము బదిలీ చేసింది. ఈ తరుణంలో డిజి ఆఫీస్ లో వెయిటింగ్ లో ఉన్న డిఎస్పీ లందరికీ ప్రభుత్వం పోస్టింగ్ ఇచ్చింది. కాజా బదిలీలతో తెలంగాణలో ఇప్పటివరకు 300 మంది డిఎస్పీలు ట్రాన్స్ఫర్ అయ్యారు. డీఎస్పీలతో పాటు హైదరాబాదులో పలువురు ఏసీపీలో సైతం బదిలీ చేసింది. ఈ మేరకు హోంశాఖ కార్యదర్శి ఉత్తర్వులు
జారీ చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version