తెలంగాణలో ఎంబీబీఎస్ కౌన్సెలింగ్ ప్రారంభం

-

తెలంగాణ రాష్ట్రంలో MBBS, BDS ప్రవేశాలకు కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. అయితే గురువారం నుంచి మొదటి విడత అడ్మిషన్లకు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకునేందుకు అవకాశం కల్పించనున్నారు. కన్వీనర్ కోటా కింద దరఖాస్తు చేసుకున్న 16,679 మంది విద్యార్థులకు సంబంధించిన మెరిట్ లిస్ట్  ను నిన్న కాళోజీ హెల్త్ యూనివర్సిటీ విడుదల చేసింది. ఈ లిస్ట్ పై ఏమైనా అభ్యంతరాలుంటే ఇవాళ సాయంత్రం లోపు వెబ్ సైట్ ద్వారా తెలియజేయాలని యూనివర్సిటీ వీసీ బి.కరుణాకర్ రెడ్డి తెలిపారు.

గురువారం ఫైనల్ మెరిట్ లిస్ట్ విడుదల చేసి, అదే రోజు వెబ్ ఆప్షన్ల నమోదు ప్రక్రియ ప్రారంభించనున్నట్టు తెలిపారు వీసీ. విద్యార్థులు అందరూ వెబ్ ఆప్షన్ల నమోదుకు సిద్ధంగా ఉండాలని సూచించారు. గత ఏడాదికి సంబంధించిన సీట్ల కేటాయింపు వివరాలు కళాశాలల వారిగా వెబ్ సైట్ లో అందుబాటులో ఉన్నాయని వివరించారు. ఈ ఏడాది MBBS, BDS సీట్ల కోసం జారీ చేసిన జీవో 33 పై కొందరూ కోర్టును ఆశ్రయించడంతో కౌన్సెలింగ్ ప్రక్రియ ఆలస్యం అయింది. ఇటీవలే సుప్రీంకోర్టు అనుమతి ఇవ్వడంలో కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version