Seethakka : ఫిబ్రవరి 21 నుంచి మేడారం జాతర ప్రారంభం కానుందని మంత్రి సీతక్క తెలిపారు. మేడారం జాతర సమీక్షా సమావేశం అనంతరం మంత్రి సీతక్క మాట్లాడుతూ… ఆసియాలోనే అతిపెద్ద ఆదివాసీ జాతరను జయప్రదం చేస్తామని..ఫిబ్రవరి 21 నుండి జాతర ప్రారంభం అవుతుందన్నారు. ఇప్పటికే రూ. 75 కోట్ల నిధులు సీఎం రేవంత్ రెడ్డి మంజూరు చేశారు…రేవంత్ రెడ్డి పాదయాత్ర సైతం మేడారం దేవతల సన్నిధి నుండే ప్రారంభించారని గుర్తు చేశారు మంత్రి సీతక్క.
అడగ్గానే నిధులు కేటాయించారు….అవసరమైన మేరకు మరిన్ని నిధులు ప్రభుత్వాన్ని కోరుతామన్నారు. మా ఇంటి ఇలవేల్పు మేడారం తల్లులు అని..అధికారులకు అన్ని సూచనలు చేశామని చెప్పారు మంత్రి సీతక్క. జాతర విజయవంతం కోసం ప్రణాళిక రూపొందించామని..కాంట్రాక్ట్ పనులను అవినీతి లేకుండా పూర్తి చేస్తామని వెల్లడించారు. శాశ్వత ప్రాతిపదికన చేస్తామని…కేంద్రానికి కొన్ని పనులకోసం ప్రతిపాదనలు పంపామన్నారు. మేడారం జాతరకు జాతీయ హోదా కోసం రిక్వెస్ట్ పంపుతున్నాము…అందరూ సహకరించి జాతరను విజయవంతం చేయాలని కోరారు సీతక్క.