సీఎం రేవంత్‌ రెడ్డితో మైక్రాన్​ కంపెనీ సీఈవో భేటీ

-

ప్రపంచంలోనే అతి పెద్ద మెమరీ చిప్స్ తయారీ కంపెనీ మైక్రాన్ టెక్నాలజీ ప్రెసిడెంట్, సీఈవో సంజయ్ మెహ్రోత్రా ముఖ్యమంత్రి ఏ. రేవంత్రెడ్డితో భేటీ అయ్యారు. అమెరికా నుంచి ప్రత్యేకంగా సీఎంను కలిసేందుకు వచ్చిన శ్రీ సంజయ్ మెహ్రోత్రా గురువారం సాయంత్రం సీఎం నివాసంలో ఆయనను కలుసుకున్నారు.

Micron Technology CEO meets CM Sri Revanth Reddy

తెలంగాణలో పెట్టుబడులకు, పరిశ్రమల స్థాపనకు అనుకూలమైన వాతావరణం ఉందని ఆయన సంతోషం వ్యక్తం చేశారు. మైక్రాన్ ఆసక్తి చూపితే రాష్ట్ర ప్రభుత్వం తగిన సహాయ సహకారాలను అందిస్తుందని ముఖ్యమంత్రి కంపెనీ ప్రతినిధులకు భరోసా ఇచ్చారు. పరిశ్రమల స్థాపన, నైపుణ్యాల అభివృద్ధి, ఉపాధి కల్పనతో పాటు రాష్ట్ర ఆర్థిక వృద్ధికి పారిశ్రామిక వేత్తలు ముందుకు రావాలని సీఎం తన ఆకాంక్షను వ్యక్తం చేశారు. అమెరికాకు చెందిన ఈ సంస్థ సెమీ కండక్టర్ల తయారీలో ప్రపంచంలోనే నాలుగో అతిపెద్ద కంపెనీ. మెమరీ చిప్స్ తయారు చేసే సంస్థల్లో అతి పెద్దది.

Read more RELATED
Recommended to you

Exit mobile version